సల్మాన్ ఖాన్ తల్లి పాత్రపై సోనాలి కులకర్ణి ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Mumbai

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన భరత్ చిత్రంలో ఆయనకు తల్లిగా నటించేందుకు మొదట్లో తాను సంకోచించినట్లు ప్రముఖ నటి సోనాలి కులకర్ణి వెల్లడించారు. ఈ పాత్రకు తాను సరిపోనని భావించి ఇతర నటీమణుల పేర్లను సిఫారసు చేసినట్లు ఆమె తెలిపారు. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కథ చెప్పిన తర్వాతే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు సోనాలి కులకర్ణి పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ను స్వీకరించినట్లు ఆమె స్పష్టం చేశారు.