బ్రిక్స్ సదస్సు విజయం భారత్ సామర్థ్యానికి నిదర్శనం: చంద్రబాబు

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

దిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. చరిత్రాత్మక సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.