గోవా రాజ్‌భవన్‌లో నటుడు డాక్టర్ నరేష్ ఘన సత్కారం
రిపోర్టర్: సునీల్
స్థలం: గోవా
భారతీయ సినీ పరిశ్రమలో 55 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న వెర్సటైల్ యాక్టర్ నవరసరాయ డా. నరేష్ విజయకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా గోవా రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు డా. నరేష్‌ను ఘనంగా సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు.