అమెరికాలో ఘనంగా నాట్స్ చార్లెట్ సంబరాలు: తెలుగు సంస్కృతికి ప్రతీక

రిపోర్టర్: శివ స్థలం: Charlotte

అమెరికాలో తెలుగు వారిని ఐక్యం చేసేందుకు నాట్స్ ఆధ్వర్యంలో చార్లెట్ లో సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు నాట్స్ అధ్యక్షులు రాజ్ అల్లాడ తెలిపారు. ఈ వేడుకల్లో వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు పాల్గొని సాంస్కృతిక వైభవాన్ని చాటారు. చిన్నారుల ప్రదర్శనలు, సైన్స్ ఫెస్ట్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎనిమిది వందల మందికి పైగా రిజిస్ట్రేషన్లతో చార్లెట్ తెలుగు సమాజం ఐక్యతను చాటిచెప్పింది.