200 ఏళ్ల నిరీక్షణ: ఆడపిల్ల పుట్టినందుకు ఘనంగా ఊరేగింపు
రిపోర్టర్: గోపి
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పర్లీలో 200 ఏళ్ల తర్వాత దహిఫాలే కుటుంబంలో ఆడపిల్ల జన్మించింది. ఐదు తరాల నిరీక్షణ తర్వాత పుట్టిన 'గార్గి'ని చూడగానే కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. పూల రథంపై ఊరేగింపుగా చిన్నారిని ఇంటికి తీసుకొచ్చారు. 'ఆడపిల్ల పుట్టడం మా అదృష్టం, ఆమెను పువ్వులా పెంచుకుంటాం' అని తాత లింబాజీ దహిఫాలే భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ అరుదైన వేడుక స్థానికంగా చర్చనీయాంశమైంది.