'రేపు వైఎస్సార్‌సీపీ కీలక భేటీ': పార్టీ శ్రేణులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Tadepalli
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అత్యంత కీలకమైన సమావేశం జరగనుంది. తాడేపల్లి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు మరియు జిల్లా అధ్యక్షులతో శ్రీ వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, రాజకీయ వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.