జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీ పునరుద్ధరణ

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులపై జరిగే దాడులు, దౌర్జన్యాల కేసులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీని ఏపీ ప్రభుత్వం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగనుంది. హోం మంత్రి చైర్మన్గా, సమాచార శాఖ మంత్రి వైస్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. వివిధ శాఖల ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని అధికారులు తెలిపారు.