జామియా మిల్లియా ఇస్లామియా హెచ్చరిక: విద్యార్థులకు నిరసన విరమించాలని వర్సిటీ అల్టిమేటం

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నిరసన తెలుపుతున్న విద్యార్థులకు చివరి హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గలిస్తాన్ ఎ ఘాలిబ్ భవనాన్ని తక్షణమే ఖళీ చేయాలని స్పష్టం చేశారు. లేనియెడల క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనల కారణంగా తరగతులను ఆన్లైన్కు మార్చారు. ఎన్నికల సంఘం ఏర్పాటు డిమాండ్పై ఉద్రిక్తత కొనసాగుతోంది. స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళనలు ఆగవని విద్యార్థులు తేల్చిచెప్పారు.