వెదురు ఆధారిత ఉత్పత్తులతో ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలి
రిపోర్టర్: నరేష్
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై వెదురు పెంపకం, పర్యావరణ పరిరక్షణ అలాగే వెదురు ఆధారిత ఉత్పత్తుల ప్రాధాన్యతపై మాట్లాడారు. వెదురు పెంపకం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు నేలకోతను నియంత్రించవచ్చని, చేతివృత్తిదారులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని ఆయన తెలిపారు.