'చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగింగ్ తప్పనిసరి': తిరుమల పోలీసుల కీలక సూచన

రిపోర్టర్: నరేష్ స్థలం: తిరుమల

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ఈ సమయంలో చిన్నారులు తప్పిపోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా 'చైల్డ్ ట్యాగింగ్' వినియోగించాలని తిరుమల పోలీసులు విజ్ఞప్తి చేశారు. భక్తులు అందరూ పోలీసుల ఈ నిబంధనను పాటించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సహకరించాలని కోరారు.