అక్రమ ఇసుక రవాణా చేసే వారిన వదిలిపెట్టొద్దని బీర్ల అయిలయ్య హెచ్చరిక
రిపోర్టర్: భాస్కర్
స్థలం: राजపేట
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడేవారు సొంత పార్టీవారైనా, బంధువులైనా సరే వదిలిపెట్టవద్దని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పోలీసులను హెచ్చరించారు. రాజపేట మండలం రేణికుంట కో-ఆపరేటివ్ సొసైటీ మహాజన సభలో ఆయన మాట్లాడుతూ, అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పట్టుకుని నెల రోజులపాటు పోలీస్ స్టేషన్లోనే ఉంచాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలో ఇసుక దందా విపరీతంగా సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో ఆయన ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.