విశాఖలో చిరిగిన నోట్ల కుప్ప: కలకలం రేపిన మిస్టరీ!

రిపోర్టర్: సురేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద భారీగా చిరిగిన కరెన్సీ నోట్లు ప్రత్యక్షమవడం కలకలం రేపింది. రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు కుప్పగా పడి ఉండటాన్ని వాకర్స్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నోట్లను స్వాధీనం చేసుకుని, అవి నిజమైనవా, నకిలీవా అని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.