నర్సంపేట గులాబీ నేతలతో భేటీ కానున్న కేటీఆర్
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో నేడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గులాబీ శ్రేణులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. నియోజకవర్గ భవిష్యత్ కార్యాచరణతో పాటు కొత్త ఇన్ఛార్జి నియామకంపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమావేశంపై నియోజకవర్గ రాజకీయ వర్గాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.