మమతా బెనర్జీ నివాసం వెలుపల కత్తితో మహిళ హల్చల్: కలకలం
రిపోర్టర్: సునీల్
స్థలం: కోల్‌కతా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వెలుపల కత్తితో ఓ మహిళ హల్చల్ చేయడం కలకలం రేపింది. కోల్కతాలోని కాళీఘాట్లో ఉన్న ఆమె ఇంట మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దోలా సేన్ కాళీఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నివాసం నుంచి బయలుదేరిన సమయంలో ఆ మహిళ కత్తితో దాడికి యత్నించినట్లు ఎంపీ ఆరోపించగా, పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి పూర్తి నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది.