గ్రామీణ ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా వైద్య శిబిరం

రిపోర్టర్: Rajashekar స్థలం: నర్సంపేట

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావు పేట మండలం బోడ మాణిక్యం తండాలో గ్రామ సర్పంచ్ భూక్య ఉమా మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకున్న ఈ ముందస్తు చర్యల పట్ల వృద్ధులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్లు రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న సర్పంచ్ను స్థానిక ప్రజలు, నాయకులు అభినందించారు.