విజయవాడ ఇంద్రకీలాద్రిపై లడ్డూ ప్రసాదం ఏటీఎం యంత్రం ప్రారంభం
రిపోర్టర్: హరి
స్థలం: విజయవాడ
విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదం ఏటీఎం యంత్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ అధికారికంగా ప్రారంభించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రసాద విక్రయాల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఈ నూతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. సాధారణ ఏటీఎం తరహాలోనే డిజిటల్ చెల్లింపులు చేస్తూ భక్తులు సులువుగా లడ్డూ బాక్సులు పొందవచ్చు.