ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న ఐలు
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) డిమాండ్ చేసింది. రామన్నపేట కోర్టు ఎదుట ఐలు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ఐలు నాయకులు విమర్శించారు.