వాట్సప్‌లోనే ఇకపై పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు!

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ కీలక వెసులుబాటు కల్పించింది. ఇకపై వాట్సప్ ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు మరియు క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అధికారిక వెరిఫైడ్ నంబర్‌కు మెసేజ్ చేసి ప్రాంతీయ భాషల్లోనూ ఈ సేవలను పొందవచ్చు. దీనివల్ల ఈపీఎఫ్‌ఓ పోర్టల్ లాగిన్ అవ్వాల్సిన శ్రమ తప్పుతుంది.