చింతలపూడిలో సారవంతమైన భూముల సేకరణపై మాజీ మంత్రి వడ్డే సోమనాధీశ్వరరావు హెచ్చరిక
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: చింతలపూడి
విదేశాలలో పూర్తిగా నిషేధించిన అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల కోసం చింతలపూడి ప్రాంతంలోని అత్యంత సారవంతమైన భూములను సేకరిస్తున్నారని మాజీ మంత్రి వడ్డే సోమనాధీశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల ఇటువంటి అనాలోచిత చర్యల పట్ల రైతులు, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన స్పష్టం చేశారు.