'ప్రశాంతంగా వినాయక నిమజ్జనం': డ్రోన్లతో తిరుపతి పోలీసుల నిరంతర నిఘా

రిపోర్టర్: నరేష్ స్థలం: Tirupati

తిరుపతిలో వినాయక నిమజ్జన కార్యక్రమం అత్యంత ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సురక్షితంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తిరుపతి పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతరం క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అన్ని ముందస్తు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.