చైనా పర్యటనలో ఎన్‌బీఏ స్టార్‌ స్టేఫెన్‌ కర్రీకి ఊహించని భద్రతా సమస్యలు

రిపోర్టర్: విజయ్ స్థలం: World

చైనా పర్యటనలో ఉన్న గోల్డెన్ స్టేట్ వారియర్స్ స్టార్ ప్లేయర్ స్టేఫెన్‌ కర్రీకి అభిమానుల తాకిడితో తీవ్ర భద్రతా సమస్యలు ఎదురయ్యాయి. కొత్త సీజన్‌కు ముందు చైనీస్ స్నీకర్ కంపెనీతో భారీ ఒప్పందం కుదుర్చుకున్న కర్రీ, అభిమానులను కలిసే క్రమంలో భారీ జనసందోహం ఏర్పడటంతో సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని వెంటనే అక్కడి నుంచి సురక్షితంగా వెనక్కి తీసుకువెళ్లారు. ఈ పర్యటనలో ఆయన కొద్దిగా నడుము వంచి నడుస్తున్నట్లు కూడా కనిపించారు.