వైద్య విద్య ప్రవేశాల నీట్ పీజీ సీట్ల జాబితా విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: న్యూఢిల్లీ
నేషనల్ మెడికల్ కమిషన్ నీట్ పీజీ కౌన్సెలింగ్ 2026 కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల సీట్ల జాబితాను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ పీజీ కోర్సులకు సంబంధించి యాభై వేలకు పైగా సీట్లు జాబితాలో చేర్చినట్లు కమిషన్ పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా సీట్ల వివరాలను పరిశీలించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.