స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర మూలాలున్న నీలా విఖే పాటిల్

రిపోర్టర్: కిరణ్ స్థలం: స్టాక్‌హోమ్

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ విద్యావేత్త అశోక్ విఖే పాటిల్ కుమార్తె నీలా విఖే పాటిల్ స్వీడన్ పార్లమెంట్‌కు స్టాక్‌హోమ్ సిటీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆమె గ్రీన్ పార్టీ తరఫున ఈ విజయం సాధించారు. భారతదేశంపై తనకు ఎంతో ప్రేమ ఉందని, తన తాతగారిని ఎంతగానో మిస్ అవుతున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. స్వీడన్‌లోని వామపక్ష కూటమి ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే.