రాష్ట్రంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు: మంత్రి సీతక్క స్పష్టీకరణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఎర్రమంజిల్లోని గ్రామీణ తాగునీటి సరఫరా కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.