లక్నోలో కేఫ్ యజమాని అనుమానాస్పద మృతి: ప్రియురాలిపై తల్లి తీవ్ర ఆరోపణలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: లక్నో

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో బాల్కనీ నుంచి కిందపడి ఇరవై ఎనిమిదేళ్ల కేఫ్ యజమాని శివ శర్మ దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు. తన కుమారుడిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలు శ్రద్ధా దూబే వేధింపులకు గురిచేసి, బ్లాక్మెయిల్ చేసి హత్య చేసిందని మృతుడి తల్లి రంజనా శర్మ ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని, అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.