ఎన్టీఆర్ జిల్లాలో కొత్త వంతెన నిర్మాణం: నెల రోజుల్లో అందుబాటులోకి రానున్న ఘట్టం

రిపోర్టర్: రాజేష్ స్థలం: NTR District

ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలోని కుమ్మరికుంట్ల వద్ద కూలిన వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందన కరువైందని, దీంతో తాత్కాలిక రోడ్డుపైనే రాకపోకలు సాగించాల్సి వచ్చిందని స్థానికులు వాపోయారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని సుమారు రూ.80 లక్షల నిధులతో పనులు చేపట్టిందని, త్వరలోనే వంతెన అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.