జడ్పీ చైర్మన్ కారు బానెట్‌పై మూడు కిలోమీటర్లు ప్రయాణించిన టీడీపీ కార్యకర్త

రిపోర్టర్: కిరణ్ స్థలం: చిత్తూరు

చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కారును అడ్డుకునే ప్రయత్నంలో సురేశ్ అనే టీడీపీ కార్యకర్త కారు బానెట్ పైకి ఎక్కాడు. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా పోనివ్వడంతో, అతను బానెట్‌పైనే మూడు కిలోమీటర్లు ప్రయాణించి సురక్షితంగా కిందకు దిగాడు. ఇరువర్గాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.