కళింగపట్నం సమీపంలో రాత్రికి తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం
రిపోర్టర్: శివ
స్థలం: విశాఖపట్నం
కళింగపట్నానికి సమీపంలో ఇవాళ రాత్రి తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీరం దాటే సమయంలో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయగా, పలు పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.