రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు సరికావంటూ కాంగ్రెస్కు జి. కిషన్ రెడ్డి చురకలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసే రాజకీయ ఆరోపణలపై నలభై ఇద్దరు మాజీ న్యాయమూర్తులు వ్యక్తం చేసిన తీవ్ర ఆందోళనలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గమనించాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హితవు పలికారు. రాజ్యాంగ సంస్థల పరిరక్షణ పేరుతో విడుదల చేసిన బహిరంగ లేఖలోని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం మరియు న్యాయవ్యవస్థపై నిరాధార విమర్శలు చేయడం మానుకోవాలని జి. కిషన్ రెడ్డి సూచించారు.