లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురు దుర్మరణం
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంజి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కజొన్నలు, చేపలు విక్రయించి వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ముగ్గురు చిరు వ్యాపారులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.