నాగార్జున వందో చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న టబు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

అక్కినేని నాగార్జున తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వందో చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నిన్నే పెళ్లాడతా చిత్రంలో కలిసి నటించిన ఈ కాంబో, మళ్లీ చాలా ఏళ్ల తర్వాత కింగ్ 100 సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, డిసెంబర్ 24న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు.