జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ యువతి ప్రీతి ముండే

రిపోర్టర్: గోపి స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే జైపూర్ వేదికగా జరిగిన మిస్ ఇండియా ఎర్త్ 2026 పోటీల్లో మిస్ ఎర్త్ వాటర్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మోడలింగ్ తో పాటు యోగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో రాణిస్తూ జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేయడం పట్ల గ్రామస్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేశారు.