అంటార్కిటికాలోని మైత్రి స్టేషన్లో ఘనంగా వినాయక చవితి

రిపోర్టర్: సురేష్ స్థలం: అంటార్కిటికా

భారత్కు పదిహేను వేల కిలోమీటర్ల దూరంలోని అంటార్కిటికాలో ఉన్న మైత్రి రీసెర్చ్ స్టేషన్లో భారతీయ శాస్త్రవేత్తలు గణేష్ చవితి వేడుకలను అత్యంత వినూత్నంగా నిర్వహించారు. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ పరిశోధకులు మంచుతో వినాయక ప్రతిమను సుందరంగా తీర్చిదిద్దారు. స్టేషన్లో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న అనిరుధ్ ధర్ ఈ వేడుకలకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, ఈ అద్భుతమైన పర్యావరణహిత వేడుకలు ప్రస్తుతం నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.