ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తే భారీ జరిమానా!
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కాకినాడ
అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఎమ్మార్పీ ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేసిన దుకాణదారుడికి జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ రూ.ఏడు లక్షల భారీ జరిమానా విధించింది. వాటర్ బాటిల్‌పై రూ.7 ఎక్కువగా వసూలు చేయడంతో బాధితుడు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన కమిషన్ బాధితుడికి నష్టపరిహారంతో పాటు సంక్షేమ నిధికి ఈ మొత్తం చెల్లించాలని సంచలన తీర్పు వెలువరించింది.