రేపల్లె అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుపై ఓటేయాలని మంత్రి ఆనగాని సత్య ప్రసాద్ విజ్ఞప్తి
రిపోర్టర్: విజయ్
స్థలం: బాపట్ల
రేపల్లె పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి మరియు సంక్షేమ పాలనను ప్రజలకు వివరించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి మరియు రేపల్లె ఎమ్మెల్యే ఆనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు. రేపల్లె మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే నవంబర్ మొదటి తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి చైర్మన్ అభ్యర్థి అవర్ణ మరియు కూటమి కౌన్సిలర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన స్థానిక ఓటర్లను కోరారు.