సర్వేపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో బయో ఎనర్జీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.

రిపోర్టర్: వెంకట్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని విశ్వసముద్ర బయో ఎనర్జీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ట్యాంకర్లలోని ఆయిల్ పూర్తిగా దగ్ధమైంది. దట్టమైన పొగతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.