రాష్ట్రంలో ప్రయాణికుల కోసం త్వరలో కొత్త బస్సులున్నట్లు కోనకళ్ల వెల్లడి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయవాడ

ఆర్టీసీ సేవలను మరింత ఆధునీకరించడానికి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరలో 1,550 కొత్త బస్సులను సమకూర్చనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోనకళ్ల నారాయణ రావు ప్రకటించారు. పర్యావరణాన్ని రక్షించేందుకు ఈ-బస్సుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రభుత్వం రూ. 3,400 కోట్ల ఆర్థిక భారాన్ని భరిస్తోందని పేర్కొన్నారు. సిబ్బంది కొరతను కూడా దశలవారీగా అధిగమిస్తామని ఆయన స్పష్టం చేశారు.