హిందుస్థాన్ జింక్ భారీ లాభాలు: నికర లాభం రూ.6,412 కోట్లకు దూసుకెళ్లింది
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
ప్రపంచంలోనే ప్రముఖ లోహ ఉత్పత్తి సంస్థ అయిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఆర్థిక ఫలితాలలో అద్భుతమైన వృద్ధిని సాధించిందని సీఈవో అమరేందు ప్రకాశ్ వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే కంపెనీ నికర లాభం ఏకంగా నూట నలభై రెండు శాతం పెరిగి ఆరు వేల నాలుగు వందల పన్నెండు కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. ఉత్పత్తి వ్యయం తగ్గడం, వెండి ఉత్పత్తి పెరగడం ఈ రికార్డు లాభాలకు ప్రధాన కారణమని పేర్కొంటూ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై పూర్తి స్పష్టతనిచ్చారు.