విజయవాడ ఆర్యవైశ్య భవన్ నిర్మాణానికి ఇరవై లక్షల విరాళం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కావలి

నెల్లూరు జిల్లా కావలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ విజయవాడలో నిర్మిస్తున్న ఆర్యవైశ్య మహాసభ భవన్ నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగంగా తొలి విడతగా ఐదు లక్షల రూపాయలను మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌కు అందజేశారు. అలాగే రూరల్ సంఘం తరఫున రెండున్నర లక్షల విరాళాన్ని సమర్పించారు.