ఫ్రాన్స్‌లో ఘోర రైಲು ప్రమాదం, 44 మందికి గాయాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: World

ఉత్తర ఫ్రాన్స్‌లో ప్రయాణికుల రైలు పట్టాలు తప్పడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒక యువతి తీవ్రంగా గాయపడగా, మరో 43 మందికి స్వల్ప గాయాలయ్యాయి. రౌవెన్ నుంచి కాన్ వెళ్తున్న ఈ రైలులో దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.