యూపీఎస్సీ ఓబీసీ క్రీమీలేయర్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.
రిపోర్టర్: మహేష్
స్థలం: India
యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో విజయం సాధించినా సుమారు వంద మంది ఓబీసీ అభ్యర్థులకు సర్వీసు కేటాయింపు నిరాకరించడం వివాదాస్పదమైంది. తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగానే క్రీమీలేయర్‌ను నిర్ణయించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోస్టుల హోదాను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అర్హత సాధించినా పోస్టింగ్ రాక అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.