ఆంధ్రా యూనివర్సిటీ నిర్మాణాల అంచనాల పెంపుపై కూటమి ప్రభుత్వంపై కొండా రాజీవ్ గాంధీ ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: Andhra Pradesh
యూనివర్సిటీల్లోనూ అవినీతికి కూటమి ప్రభుత్వం తెరదీస్తోందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా రాజీవ్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆంధ్రా యూనివర్సిటీలో నూతన భవనాల నిర్మాణాల కోసం తొలుత తొంబై ఐదు కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించి, కేవలం నాలుగు నెలల్లోనే ఆ అంచనాలను రెండు వందల పది కోట్ల రూపాయలకు ఎందుకు పెంచారని ఆయన నిలదీశారు. ఈ విధంగా విపరీతంగా పెంచిన ఈ ప్రజాధనం అంతా చివరికి ఎవరి జేబుల్లోకి వెళ్తోందని కొండా రాజీవ్ గాంధీ సూటిగా ప్రశ్నించారు.