ఎల్లారెడ్డిపేటలో సంచలనం: ఉప సర్పంచ్ పై కత్తితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: ఎల్లారెడ్డిపేట

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామ ఉప సర్పంచ్ బొడ్డు రాజుపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు అజ్మీర శ్రీనును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ.వెంకటేష్ తెలిపారు. చిన్న వివాదం కారణంగా జరిగిన ఈ ఘర్షణలో తీవ్ర గాయాలపాలైన బాధితుడికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.