విజయవాడలో వందే భారత్ రైలు బోగీలో మంటలు చెలరేగి కలకలం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయవాడ

విజయవాడలో ఆగి ఉన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సీ4 బోగీలో అకస్మాత్తుగా పొగలు, మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే మంటలను అణచివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే కోణంలో రైల్వే పోలీసులు మరియు అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు.