నేరాల ఛేదనలో పోలీసు జాగిలాల సేవలు కీలకం అంటూ హోంమంత్రి అనిత
రిపోర్టర్: విజయ్
స్థలం: మంగళగిరి
నేరాల ఛేదనలో జాగిలాల సేవలు అత్యంత కీలకంగా మారుతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళగిరి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ గ్రౌండ్లో కెనైన్లు, హ్యాండ్లర్ల 23వ బ్యాచ్ పాసింగ్అవుట్ పరేడ్ నిర్వహించారు. పది నెలల కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న 36 కెనైన్లు పరేడ్లో పాల్గొన్నాయి. నార్కోటిక్స్, పేలుడు పదార్థాల గుర్తింపు, నేరాల ఛేదనలో వీటిని వినియోగించనున్నారు. రెండేళ్లలో 78 కెనైన్స్ను అందుబాటులోకి తెచ్చి నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేస్తున్నామని ఈ సందర్భంగా హోంమంత్రి తెలిపారు.