తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మాక్‌ అసెంబ్లీ నిర్వహణ

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం పాత్ర పోషించి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐదేళ్లు కాదు 25 ఏళ్లు మేమే ఉంటామని, ఎప్పుడో ఒకప్పుడు హామీలు అమలు చేస్తామంటూ తలసాని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు.