సీపీఆర్ఐలో 110 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

రిపోర్టర్: నరేష్ స్థలం: భారతదేశం

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీఆర్ఐ) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 110 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇంజనీరింగ్ ఆఫీసర్, టెక్నికల్ అటెండెంట్, అసిస్టెంట్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 12, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అధికారిక వెబ్‌సైట్ cpri.res.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.