కాకినాడ పోర్ట్ హత్య కేసులో ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష
రిపోర్టర్: సునీల్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ పర్యవేక్షణలో పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ గౌరవ కోర్టు సంచలన తీర్పు వెలువరించినట్లు కాకినాడ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను సేకరించి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.