ఆసియా క్రీడలకు రిఫరీగా తొలి భారతీయ మహిళగా కీర్తిష్ణ ఆర్య ఘనత

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

ఉత్తరాఖండ్‌కు చెందిన కీర్తిష్ణ ఆర్య ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో కుస్తీ పోటీలకు సాంకేతిక అధికారిక రిఫరీగా ఎంపికై చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారు. ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కూడా పట్టుదలతో కోచింగ్ పరీక్ష పూర్తి చేసిన ఆమె, ఇప్పుడు జపాన్‌లోని నగోయాలో జరిగే ఈ క్రీడల్లో రెఫరీ, జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.