విఘ్నేశ్వరుని కృపతో అందరికీ సుఖసంతోషాలు కలగాలి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పెంచికల్పేట్
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, పెంచికల్పేట్ మండల ప్రజలకు మరియు మిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుని కృపతో ప్రతి ఒక్కరి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అన్ని రంగాలలో విజయం కలగాలని మనసారా కోరుకుంటున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.